YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వందే భారత్ కు టెక్నికల్ ప్రాబ్లమ్స్

వందే భారత్ కు టెక్నికల్ ప్రాబ్లమ్స్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్‌ రహిత సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ- వారణాసి మధ్య నడిచే ట్రైన్-18ను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో పిలుస్తున్నారు. అయితే, శుక్రవారం ప్రారంభమైన ఈ రైలుకు ద్వితీయ విఘ్నం ఎదురయ్యింది. వారణాసి నుంచి ఢిల్లీకి శనివారం ఉదయం బయలుదేరిన ఈ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బ్రేకింగ్‌ వ్యవస్థలో లోపం తలెత్తడంతో చమ్రోలా స్టేషన్‌లో ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. శనివారం ఉదయం 5.30 గంటలకు వారణాసి నుంచి రైలు బయలుదేరిన మూడు గంటల తర్వాత నాలుగు కోచ్‌లలో బ్రేకు పట్టేయడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో సాంకేతిక సమస్యను గుర్తించిన లోకో పైలెట్ ప్రయాణికులను మరో రైలులో తరలించారు. రైలు ఓ ఆవును ఢీకొట్టడంతో చివరి బోగీ దెబ్బతింది. బోగీ చక్రాలకు దాని మృతదేహం చుట్టుకోవడం వల్లే బ్రేకులు పట్టేశాయని గుర్తించిన లోకోపైలెట్లు రైలును నిలిపివేశారు. భోగీల్లో నుంచి పొగలు రావడంతో విద్యుత్ సర్క్యూట్‌‌ అయినట్టు అనుమానించారు. రైల్వే ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు మాత్రమే ప్రయాణిస్తుండటంతో వారిని మరో రైలులో ఢిల్లీకి పంపారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి బ్రేకింగ్ వ్యస్థను సరిచేయడంతో రైలును అక్కడ నుంచి ఖాళీగా ఢిల్లీకి బయలుదేరింది. అంతేకాదు సాంకేతిక లోపం కారణంగా దీని సాధారణ వేగం గంటకు 40 కిలోమీటర్ల మించకుండా ప్రయాణిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే, ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ రైలును గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. ఢిల్లీ, వారణాసి మధ్య దూరాన్ని ఇది కేవలం 9.40 గంటల్లో పూర్తిచేస్తుంది. దేశీయంగా తయారు చేసిన ఈ రైలు సమర్థవంతంగా పనిచేస్తోందని నిర్థరించుకున్న అనంతరం రైల్వేశాఖ మరో వంద రైళ్ల తయారీకి ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్‌లో 7000 కిలోమీటర్లు ప్రయాణించింది. 

Related Posts