YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

టీజేఏసీ పార్టీ పనులు  ప్రైవేట్‌ ఏజెన్సీకి 

Highlights

  • కార్యాలయం కోసం అన్వేషణ 
  • ఆవిర్భావ సభకు జాతీయ స్థాయిలో నేతలను
టీజేఏసీ పార్టీ పనులు  ప్రైవేట్‌ ఏజెన్సీకి 

తెలంగాణ  రాజకీయ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ.(టీజేఏసీ) నూతన పార్టీ ఆవిర్భావానికి తెరవెనుక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్‌ పనులను టీజేఏసీ ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది.పార్టీ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటేషన్‌ పనుల కోసం ఏజెన్సీ ఇప్పటికే పలుమార్లు కోదండరామ్‌ సలహాలు , సూచనలతో ఢిల్లీకి వెళ్లివచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి కోదండరామ్‌తో కలిసి మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది.  కోదండరాం ఏర్పాటు చేయనున్న పార్టీ గుర్తు, జెండాను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది.  సాధారణంగా పార్టీ ఏర్పాట్లను. కోదండరామ్‌ పార్టీ ఏర్పాటు పనులు చక్కబెడుతూనే మరోవైపు ఆవిర్భావ సభకు జాతీయ స్థాయిలో నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో వరంగల్‌లో నిర్వహించే సభకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను టీజేఏసీలోని కీలక నేతలు అప్పగించారు.ఎవరైతే పార్టీ పెడతారే వారే నేరుగా చేసుకుంటారు. కానీ టీజేఏసీ మాత్రం పార్టీ పనులను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. కోదండరామ్‌ నేరుగా పార్టీ ఏర్పాటు పనుల్లో నిమగ్నం అయితే.. అటు అధికార పార్టీ నుంచి.. జాతీయ స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయనే అనుమానంతో కోదండరామ్‌ అండ్‌ టీమ్‌ పార్టీ ఏర్పాటు పనులను ఏజెన్సీకి అప్పగించింది. 
టీజేఏసీ. కార్యాలయ వ్యవహారాలను  ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఒక భాగంలో కొనసాగిస్తున్నారు. ఈ క్వార్టర్స్‌ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేకు చెందినదిగా తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు పనులను నేరుగా కోదండరామ్‌ ఇంట్లోనే నిర్వహించడం సాధ్యంకాకపోవడంతో ఈ క్వార్టర్‌ను ఉపయోగించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ ఏర్పాటు, స్టీరింగ్‌ కమిటీ సమావేశాలు ఇతర పనుల ఏర్పాట్లు సైతం ఈ క్వార్టర్స్‌ నుండే జరుగుతున్నాయి. 

Related Posts