YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అహంకారం నెత్తికెక్కిన తెరాస

అహంకారం నెత్తికెక్కిన తెరాస

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అహంభావంతో కెసిఆర్, ఫ్రస్టేషన్ తో జగన్ దుర్మార్గాలు చేస్తున్నారు. వ్యక్తికైనా, సంస్థకైనా డేటా అనేది ఒక ఆస్తి. ఆస్తులకే హైదరాబాద్ లో రక్షణ లేదు. పిల్లచేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరైనా డేటా ఇకపై హైదరాబాద్ లో పెడతారా..? అహంకారం నెత్తికెక్కి టిఆర్ ఎస్ విపరీత చేష్టలకు దిగుతోంది. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీకి లేని టెక్నాలజి టిడిపి సొంతం. కార్యకర్తల డేటా క్రియేట్ చేసింది పార్టీ అని అన్నారు. 24 ఏళ్లు కష్టపడి డేటా రూపొందించాం. టిడిపి డేటా దొంగిలించి వైసిపికి ఇచ్చారు. ప్రభుత్వ డేటా అని అసత్య ప్రచారం చేస్తున్నారు. తమ నేరం బైటపడిందనే అసత్యాల ప్రచారమని అన్నారు. కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. మన డేటా కొట్టేసి మనపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. వైసిపికి మేలు చేసేందుకే టిఆర్ ఎస్ దుర్మార్గాలు. టిడిపి ఓడిపోతుందని చెప్పడానికి కెటిఆర్ ఎవరని ప్రశ్నించారు. హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు. మోది, కెసిఆర్, జగన్ ముగ్గురూ ఉమ్మడి ప్రచారం చేయండి. ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారు. కెసిఆర్ కు సామంతరాజుగా జగన్ మారారని విమర్శించారు. ఏపిని సామంత రాజ్యం చేయాలనేదే కెసిఆర్ కుట్ర. జగన్ ను లొంగదీసుకుని ఏపిపై దాడులకు తెగబడ్డారు. ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు. 60ఏళ్ల కష్టంతో కూడబెట్టిన ఆస్తులు లాగేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మూలాలపై దాడులు చేశారని అన్నారు. అయినా ధైర్యంగా ఏపి ముందుకు పోవడంతో అక్కసు,ఓర్వలేకే తప్పుడు పనులకు దిగుతున్నారు. మనకు రాజ్యాంగం ఉంది. కొన్ని పరిమితులు ఉన్నాయి. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. సార్వభౌమాధికార దేశంలో మనం ఉన్నాం. ఆర్టీజి డేటా రూపొందించింది ప్రభుత్వం. గోప్యమైన సమాచారం పబ్లిక్ డొమైన్ లో ఉండదు. పారదర్శకత కోసమే సంక్షేమ పథకాల సమాచారం. ఒకప్పుడు దయ్యాలు కూడా పించన్లు తీసుకునేవి. భూమిపై ఇళ్లు లేకుండానే బిల్లులు మింగేశారు. టెక్నాలజి ద్వారా రాష్ట్రంలో పారదర్శకత తెచ్చాం. అభివృద్ధి, సంక్షేమం వివరాలన్నీ అందరికీ అందుబాటులో,పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టం తెచ్చారని అన్నారు. ప్రభుత్వంలో జరిగేది తెలుసుకోవడం పౌరుల బాధ్యత. ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజితో పారదర్శకత వుంది. ప్రతి ఊళ్లో అభివృద్ది, సంక్షేమం బోర్డులు పెట్టాం. బోర్డులపై పెన్షన్లు, ఇళ్లు, రేషన్ కార్డుల వివరాలు వుంటాయి. నరేగా పనుల వివరాలు, పనిదినాల సంఖ్య బోర్డులపై వున్నాయి. ప్రజలకు మేలు చేసేది ప్రభుత్వం,ఇష్టానుసారం వ్యవహరించేది ప్రభుత్వం కాదు. ఫారమ్ 7దుర్వినియోగం చేయడం నేరం. ఎన్నికల కమిషనర్ అదే చెప్పారని అన్నారు. తప్పుడు పనులతో ఓట్ల తొలగింపు కుట్రలు చేస్తున్నారు. నేరస్తుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటుంది. గుంటూరులో 4చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు. రాజధానిలో పంటలు తగులపెట్టడం,పోలవరం కాలువకు గండికొట్టడమని అన్నారు. 

Related Posts