YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆర్మీ క్యాప్ తో టీమిండియా

  ఆర్మీ క్యాప్ తో  టీమిండియా

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా శుక్రవారం జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఆటగాళ్లు స్పెషల్ ‘ఆర్మీ’ క్యాప్ ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్లకి నివాళిగా ఈ క్యాప్ ధరించినట్లు టాస్ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. బీసీసీఐ లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్యాప్లను భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మ్యాచ్కు ముందు ఆటగాళ్లకి అందజేశారు. ఈరోజు మ్యాచ్ ఫీజు మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా ఇస్తున్నట్లు టీమిండియా ప్రకటించింది. ధోనీ సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుండగా.. వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తుండటంతో.. రాంచీలో అతనికిదే చివరి మ్యాచ్ కానుంది. భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ఎలాంటి మార్పులు చేయలేదు. ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ అరోన్ ఫించ్ ఒక మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ కౌల్టర్ నైల్ స్థానంలో రిచర్డ్సన్ తుది జట్టులోకి వచ్చాడు. హైదరాబాద్ వేదికగా గత శనివారం జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. మంగళవారం నాగ్ పూర్లో జరిగిన రెండో వన్డేలో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకంతో మళ్లీ ఫామ్ అందుకోవడం భారత్కి లాభించే అంశం

Related Posts