YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పోటీకి దూరంగా మాయావతి

పోటీకి దూరంగా మాయావతి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:  
ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, ఆర్‌ఎల్డీలతో పొత్తు పెట్టుకొని లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతోన్న మాయావతి సడెన్ షాకిచ్చారు. తాను లోక్ సభకు పోటీ చేయడం లేదని ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం కంటే మిత్రపక్షాల కూటమి అన్ని స్థానాల్లోనూ గెలుపొందడమే ముఖ్యమని బెహెన్ జీ తెలిపారు. ఒకవేళ అవసరం అనుకుంటే.. ఎన్నికల తర్వాతైనా ఎవరితోనైనా రాజీనామా చేయించి తాను ఎంపీ కాగలనని ఆమె చెప్పారు. ప్రధాని పదవి ఆశావహుల్లో ఒకరైన మాయావతి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం రాజకీయంగా సంచలనమైంది. నేను ఎన్నికల్లో పోటీ చేస్తే బీఎస్పీ కార్యకర్తలంతా నేను పోటీ చేసే లోక్ సభ స్థానంలోనే ప్రచారానికి సమయం కేటాయిస్తారు. నేను చెప్పినా వారు వినిపించుకోరు. ఇది పార్టీకి ప్రయోజనకరం కాదని మాయావతి తెలిపారు. యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ 37 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ 38 స్థానాల్లో బరిలో దిగుతోంది. ఆర్ఎల్డీ మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది. రాహుల్, సోనియా ప్రాతినిధ్యం వహిస్తోన్న అమేథీ, రాయబరేలీ స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులను బరిలో నిలపడం లేదు. యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో జనసేన, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Related Posts