YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

69 ఏళ్ల తర్వాత మండే సూరీడు

 69 ఏళ్ల తర్వాత మండే సూరీడు

మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. మే నెల రాకముందే సూర్యుడు... జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే రాబోయే వారం రోజులు మరింతగా ఎండలు మండిపోనున్నాయి. సాధారణం కన్నా ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు కేఎల్‌ యూనివర్సిటీ వాతావరణ విభాగం వెల్లడించింది. మార్చి 25వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు,వైఎస్సార్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని, అదేవిధంగా తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.గత 69 సంవత్సరాల్లో (1951-2018) మార్చి నెలలో ఇప్పటివరకూ చూడని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఇవి సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఆరు సెల్సియన్‌ ఎక్కువగా ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రజల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ మొత్తంలో ద్రవ పదార్థాలు, నీళ్లు తాగాలి. ఎండ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలి’  అని వాతావరణ శాఖ సూచనలు చేసింది.

Related Posts