YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తేజస్వీ ప్లాన్ వర్క్ అవుతుందా...

 తేజస్వీ ప్లాన్ వర్క్ అవుతుందా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

తండ్రి జైలులో ఉన్న చిన్న కొడుకు చక్రం తిప్పగలిగాడు. తండ్రి సలహాలు సూచలనతో సీట్ల ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకున్నాడు. బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్ తర్వాత వెలుగుతున్న నేత తేజస్వీ యాదవ్. లాలూ చిన్న కుమారుడైన తేజస్వి యాదవ్ తండ్రి స్థాపించిన రాష్ట్రీయ జనతాదళ్ ను ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ రాజకీయాల్లో ఇన్ యాక్టివ్ కావడం, కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలతో తేజస్వి యాదవ్ అంతా తానే అయి పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు.గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో సయితం తేజస్వియాదవ్ పార్టీని విజయపథాన నడిపాడు. దీంతో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ క్యాడర్ లో లాలూ యాదవ్ తర్వాత తేజస్వి యాదవ్ కే ఎక్కువ మంది జై కొడుతున్నారు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న తేజస్వియాదవ్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో అత్యధిక స్థానాలను సాధించి తండ్రికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు. తన తండ్రిని జైల్లో పెట్టిన మోదీ, బీజేపీ ప్రభుత్వంపై కసి తీర్చుకునేందుకు తేజస్వి పావులు కదుపుతున్నారు.బీహార్ లోక్ సభలో మొత్తం 40 స్థానాలున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యులు కలసి పోటీ చేేస్తున్నాయి. రెండు పార్టీలూ బలమైనవే కావడంతో తేజస్వి యాదవ్ మహాకూటమిని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లోనూ మహాకూటమితో వెళ్లి బీజేపీిని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగారు. కానీ నితీష్ బీజేపీతో కలసి వెళ్లిపోవడంతో రాష‌్ట్రంలో అధికారానికి దూరమయ్యారు. నితీష్ కుమార్ ను బీహార్ నుంచి సాగనంపాలంటే ఇదే మంచి అదను అని తేజస్వి యాదవ్ బహిరంగంగానే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.కాంగ్రెస్ తో తేజస్వి యాదవ్ సీట్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకోగలిగారు. మొత్తం 40 స్థానాల్లో ఆర్జేడీ 20 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లను కేటాయించారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి నాలుగు స్థానాలను ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీకి మూడు, లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టికి రెండు, వికాస శీల్ ఇన్సాన్ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించి సీట్ల సర్దుబాటును తేజస్వి విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని ఇటు బీజేపీకి, అటు నితీష్ కు షాక్ ఇవ్వాలన్నది తేజస్వి ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts