
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారాన్ని ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. బెంగాల్‌లోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆమె సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 17వ తేదీ వరకు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 14 రోజుల్లో 100 ర్యాలీల్లో పాల్గొననున్నారు మమతా బెనర్జీ. ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు ర్యాలీలు నిర్వహించేలా మమత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అసోంలో ఆరు స్థానాల్లో, జార్ఖండ్‌లో మూడు, బీహార్‌లో రెండు, అండమాన్‌లో ఒక స్థానంలో పోటీ చేస్తోంది. ఇక్కడ మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు