
నిజామాబాద్ ఎంపీ ఎన్నికలపై రైతులు హైకోర్టు ను ఆశ్రయించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ను వాయిదా వేయాలని, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అంతే కాకుండా ఈరోజు వరకు ఎన్నికల చిహ్నలు కూడా కేటాయించకపోవటం పై ఈసీని రైతుల తరఫున న్యాయవాది ప్రశ్నించారు. ఒక వేళ చిహ్నలు కేటాయించిన పక్షంలో తమకు ప్రచారానికి సమయం కొరారు . నిజామాబాద్ ఎన్నికలు రెండవ దఫా ఎన్నికలతో పాటు పోలింగ్ జరపండంటూ కోర్టుకు రైతులు విన్నవించుకున్నారు. పిటీషన్ తరఫున వాదనలు విన్న అనంతరం హై కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.