YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మెదక్ జిల్లాల్లో ఘోర ప్రమాదం 40 మందికి గాయాలు

మెదక్ జిల్లాల్లో ఘోర ప్రమాదం 40 మందికి గాయాలు

మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 40మంది గాయపడ్డారు. అకోలా-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును ముస్తాపూర్ వద్ద ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.సంగారెడ్డి జిల్లా నాగుల్‌గిద్ద మండలంలోని కేస్వార్‌ గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ అనే యువకుడి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగింది. పెళ్లికి హాజరైన వారు శుక్రవారం ఉదయం ఆర్టీసీ స్పెషల్ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. బస్సు ముస్లాపూర్‌ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts