YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీఆర్ఎస్ కే ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మద్దతు

టీఆర్ఎస్ కే ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మద్దతు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం సభ్యులందరు టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ కళాశాల ఆవరణలో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా సాధారణ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలమడుగు రాజేందర్ ముఖ్య అతిధిగా ప్రత్యేక ఆహ్వనితులుగా టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు ,టీఉద్యోగుల ఐకాస గౌరవాధ్యాక్షుడు హరిఆశోక్ కుమార్ ,టీబీసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్ లు పాల్గోన్నారు.ఈసందర్భంగా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలమడుగు రాజేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీగా పనిచేసిన కవిత ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ కోసం చేసిన పనులను వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రైవేటు ఉద్యోగుల సంఘం సభ్యులందరు ఎంపీ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసీ కవిత ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఆనంతరం హరిఆశోక్ కుమార్ మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటరియన్ గా ఎంపికైన పార్లమెంట్ లో ప్రజాగోంతుకగా సమస్యలను ప్రస్తావించే కవిత ను మరోసారి ఎంపీ గా గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతోగానో కృషి చేస్తారన్నారు.నిరుద్యోగ భృతి మంజూరు కు కార్యచరణ సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేట్ ఉద్యోగులు ,నిరుద్యోగులు అండగా ఉండాలని కొరారు.ఈకార్యక్రమంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలమూరు భాస్కర్ రావు ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగసముద్రం పురషోత్తం ,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి మారుతి ,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుజ్జేటి విజయ్ ,ఎనుగురి సురేష్ ,కార్తీక్ ,వేణు ,రాజేష్, వినోద్ కుమార్, హఫీజ్, అఫ్రోజ్ ,అల్లె మహేందర్ ,తదితరులు పాల్గొన్నారు

Related Posts