
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశంలో మోడీ ప్రభంజనం కొనసాగుతుంది. టీఆరెస్ పదహారు సీట్లని కంటున్న కలలు కలలుగానే మిగుల్తాయి. ప్రజలకు ఎన్నో ఆశలు చూపారు. కానీ, ఏవి అమలు కాలేదని బీజేపీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం అయన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి డికే ఆరుణతో కలిసి మీడియాతో మాట్లాడారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రావొద్దు అంటున్నారు సిగ్గు చేటు. తెలంగాణ ఇచ్చింది పెద్దమ్మ సోనియా. చిన్నమ్మ సుష్మాస్వరాజ్ గా చెప్పిన టీఆరెస్ నాయకులు ఇట్లా అనడం తగదని అన్నారు. బీజేపీ కి 300 సీట్లు తగ్గకుండా వస్తాయి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని వ్యాఖ్యానించారు. డీకే అరుణ మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా మోడీ ని మళ్ళీ పీఎం గా చేయాలని ఆకాంక్ష కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా అదే భావన తో ఉన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కోసం కాదని అందరికి తెలిసిందని అన్నారు. పదిహేను మంది ఎంపీలు ఉన్నప్పుడు తిప్పలేని చక్రం, ఇపుడు 16 వస్తే ఎట్లా తిప్పుతారని ఆమె ప్రశ్నించారు. దేశంలో అందరి దగ్గరికి పోయి అడిగినా ఫలితం లేదు. కేసీఆర్ కు పార్టీల మద్దతు లేదు. ప్రజల మద్దతు కూడా లేదు. మొదట పీఎం అవుతా అని చెప్పిన కేసీఆర్, ఇపుడు కీలక పాత్ర పోషిస్తా అని అంటున్నారు. ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు. ఖజానా ఖాళీ అయింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇక్కడ అమలు చేయడంలేదని ఆమె ఆరోపించారు.