YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి --టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి

కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి  --టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి  దేవులపల్లి యాదగిరి

ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి గాలి అనిల్ కుమార్ గారికి ఓటేసి గెలిపించాలని  టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి  ఓటర్లను కోరారు. సోమవారం,జెపి తండా పిట్టల కాలనీ ,  పాలాకుల,ముండ్రాయి ,గ్రామాలలో ప్రచారం చేశారు.ఎదిరించేవాడు లేకుంటే భేదిరించేవాడిదే రాజ్యమైతదని,  ప్రజలకోసం పనిచేసి ప్రజల పక్షాన పనిచేసే బడుగు బలహీన వర్గాల బీసీ ఐన  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీ పూర్తీ సహకారం అండ దండాలు ఉండాలని వారుకోరారు. కెసిఆర్ బీజేపీ కి నరేంద్రమోడీకి భయపడి కేంద్ర ప్రభుత్వన్ని నిధులు తిస్కరాలేక తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.  కనుకనే ఈరోజు ప్రజలు ఇబ్బందుల్లో  ఉన్నారని అన్నారు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మనకు రావలసిన నిధులు తెచ్చుకుందామన్నారు.

ప్రశ్నించే వారులేరని కెసిఆర్ తనఇష్టా రాజ్యాంగ పాలన సాగిస్తున్నారని అందుకే  కెసిఆర్ కు ఓటు ద్వారా బుద్దిచెప్పాలన్నారు.మరోసారి కెసిఆర్ మాయమాటలు నమ్మి కారు కు ఓటేసి బేకరు చేసుకోవద్దని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు ఓటేసి గాలి అనిల్ కుమార్ నుగెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈకార్యక్రమములో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుంటిపల్లి శ్రీనివాస్ ,చెలికాని యాదగిరి ,  దుంబాల నర్సింలు ,రంగు  అశోక్ ,రాములు ,అచ్చిన సత్తయ్య , దాసరికిషన్ ,రాగుల కనకయ్య ,రాజు ,జంగిటి శ్రీను ,తిరుపతి,కృష్ణ ,తుపాకుల  శ్రీనివాస్ ,ప్రమోద్ ,రాజిరెడ్డి ,సత్తయ్య ,రాజు,భాను,పోచయ్య, లక్ష్మణ్ ,పర్శరాములు,శ్రీకాంత్ లు పాల్గొన్నారు .

Related Posts