YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణా ఎంపీ అభ్యర్థుల కేసులు

తెలంగాణా  ఎంపీ అభ్యర్థుల కేసులు

పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కేసులు ఎదుర్కొంటున్నవారే. నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అధికారం చేజిక్కాక వారి నేరాలకు రెక్కలొచ్చేస్తున్నాయ్. ఈ దేశంలో ఏం చేసినా అడిగేవారు లేరనే ధీమా. అధికారం చాటున అక్రమాల చేయడం కోట్లు దండుకోవడం ఓ వ్యాపారంగా మారింది. పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అయ్యే అవకాశం ఎడారిలో ఎండమావిగా మారింది. ఇదే పరిస్థితి మరో పదేళ్ళు కొనసాగితే జరిగే దారుణాలను ఊహించడం కష్టం.పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్, సివిల్ కేసులు ఉండటం సర్వసాధారణమే. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో 20 మందిపై కేసులున్నాయి. వీరిలో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న సోయం బాపూరావుపై అత్యధికంగా 52 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రేవంత్‌రెడ్డిపై 42 కేసులు ఉన్నాయి. ఇక భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై 14 కేసులున్నాయి. అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వెంకట శ్యామ్ సుందర్‌ రావుపై 7 కేసులు నమోదయ్యాయి.

ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్నలోకసభ అభ్యర్థుల కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

1) సోయం బాబూరావు(బిజెపి, ఆదిలాబాద్) 52 కేసులు

2) రేవంత్ రెడ్డి (కాంగ్రెస్, మల్కాజిగిరి) 42 కేసులు

3) కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్, భువనగిరి) 14 కేసులు.

4)  వెంకట శ్యామ్ సుందర్‌ రావు (భాజపా,భువనగిరి)7 కేసులు

5) తలసాని సాయి కిరణ్ (టీఆర్ఎస్ - సికింద్రాబాద్): 6

6) నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్ - ఖమ్మం): 5

7) అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం - హైదరాబాద్): 5

8) ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్ - నల్లగొండ): 4

9) వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్ - మహబూబ్‌నగర్): 4

10) మల్లు రవి (కాంగ్రెస్ - నాగర్ కర్నూల్): 3

11) రమేశ్ రాథోడ్ (కాంగ్రెస్ - ఆదిలాబాద్): 3

12) భగవంతరావు పవార్ (బీజేపీ - హైదరాబాద్): 3 కేసులు 

ఇక దేశం  విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ప్రస్తుతం దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా 1,765 మంది ప్రజాప్రతినిధులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు మార్చిలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,122 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో చాలా కేసుల్లో కనీసం ఛార్జ్‌షీటు కూడా నమోదు కాలేదని తేలింది. ఇక 264 కేసుల్లో హైకోర్టు పరిధిలో స్టే విధించినట్లు నివేదికలో పేర్కొన్నారు.2018 మార్చిలో కేంద్రం సుప్రీం కోర్టుకు అందించిన వివరాల ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిపి యూపీలో అత్యధికంగా 248 మందిపై, తమిళనాడులో 178 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. బిహార్‌లో 144, పశ్చిమ బెంగాల్‌లో 139, ఆంధ్రప్రదేశ్ లో 132, కేరళలో 114, ఢిల్లీలో 84, కర్ణాటకలో 82 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. 

Related Posts