
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. డాక్టర్ మల్లు రవి కి నాగర్ కర్నూల్ పార్లమెంట్ బహుజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, టీఎంఆర్పీఎస్ మద్దతు ప్రకటించాయి. నేతలు మీసాల రాము మాదిగ, కొత్తపల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాలలో పర్యటించి డాక్టర్ మల్లు రవి కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అమరవీరుల ఆశయాల సాధన కోసం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలంటే నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ గా పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి ని గెలిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల ఉన్న పేదలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా జిల్లా అధ్యక్షుడు కలమూరి వెంకటేష్ మాదిగ, బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శివప్రసాద్. తెలంగాణ దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షులు దస్తగిరి. ఉదయ్. ఎల్ల పోగు చందు. మీసాల నాగరాజ్. అశోక్ . మన్యం .తదితరులు పాల్గొన్నారు