
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మంగళవారం ఉదయం లంగర్ హౌస్‌లో రూ.2.4 కోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదును కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నగదును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.. నారాయణగూడలో రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్న మరుసటి రోజే పెద్ద మొత్తం లో డబ్బు పట్టుబడింది.