
ఈ ఎన్నికలు అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు. విభజన చట్టంలోని అన్ని అంశాలు తీర్చడం జాతీయ పార్టీ కే సాద్యం. అందుకే మరోసారీ పోటి చేస్తున్నానని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కి అన్నారు. ఒటమి భయంతో కాంగ్రెస్, బిజెపి కుమ్మక్జైందని అరోపిస్తున్నారు. దైర్ఘ్యం ఉంటే నిజనిజాలు బయట పెట్టాలి. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేదా నువ్వు పోటి నుంచి తప్పుకుంటవా అని కవిత కు మధు యాష్కి సవాల్ విసిరారు. కాంగ్రెస్, టిఅర్ఎస్ మద్యే పోటి వుంటుంది. ప్రధానితో సెల్పి దిగేందుకు చూపిన అతృత, అభివృద్ధి లో కవిత చూపలేదు. జిఎస్టి, నోట్ బంధి ఇతర అంశాలలో బిజెపి కి టిఅర్ ఎస్ సపోర్ట్ చేసింది నిజం కాదా. టిఅర్ఎస్, బిజెపి రెండు ఒకటేనని అన్నారు. కాంగ్రెస్ గెలుస్తుందని, అర్దం లేని అరోపణలు చేస్తున్నారు. కవితకు ఓటమి భయం పట్టుకుంది. తెలంగాణ కు వ్యతిరేకించిన ఎంఐఎం తో పొత్తు పెట్టుకున్న పార్టీ టిఅర్ఎస్. నిజామాబాద్ లోక్ సభ పరిధి లో తిరుగుబాటు మొదలైంది. ఇదీ టిఅర్ఎస్, దోరతనం అంతానికి ప్రారంభమని అయన అన్నారు. కోడ్ వచ్చిన తరువాత కుల సంఘాలకు అనైతికంగా ప్రోసిడింగ్ ఇస్తున్నారు. ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేశాం. పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర కాంగ్రెస్ తోనే సాద్యమని అయన అన్నారు.