YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గెలుపే ధ్యేయంగా బిజేపి ఇంటింటి ప్రచారం

గెలుపే ధ్యేయంగా బిజేపి ఇంటింటి ప్రచారం
వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని కానాయపల్లి గ్రామంలో జిల్లాబిజేపి దళితమోర్చ ప్రధానకార్యదర్శి రాసమోని బాలరాజు   ఆధ్వర్యంలో పార్టీ నేతలు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గెలుపే ధ్యేయంగా, కానాయపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు  రాసామోని సాయిరాం మాట్లాడుతూ బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు అరుణ గెలుపుకై ప్రతి ఒక్కరు సైనికునిలా పార్టీ కొరకు పని చేయాలని ఆయన అన్నారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా, ఎవరి బలవంతం లేకుండా వినియోగించుకోవాలని, అదే విధంగా అరుణమ్మ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే, పాలమూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు నెరవేర్చడంతోపాటు పేదల కొరకు పని చేస్తుందని, ఆయన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి రాసామోని బాలరాజు, విజయ్ కుమార్, బాలకృష్ణ, రవీంద్ర, శివకుమార్, జగదీష్, లింగేశ్వర్, కురుమూర్తి, కాశి, జనార్ధన్ మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Related Posts