
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభ సాదారణ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలలో శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతున్నందున ఏప్రిల్ 11 వ తేది ఉదయం 7.00 గం నుండి మే 19 వతేది సాయత్రం 6.30 గం వరకు ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల కమీషన్ నిషేదం విదించినట్లు వరంగల్ లోక్ సభ రిటర్నిగ్ అధికారి ప్రశాంత్ జె.పాటిల్ ఒక ప్రకాటనలో తెలిపారు. ఎన్నికల పోలింగ్ పై నిర్వహించిన ఒపీనియన్ పోల్స్, పోల్ సర్వేలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు, ఇతర మీడియా మాధ్యమాలలో ప్రచురణ ,ప్రసారం చేయరాదని తెలిపారు.