
ఒకవైపు ఏపీలో శుక్రవారం (ఏప్రిల్ 12న) ఇంటర్ ఫలితాలు వెల్లడికాగా.. తెలంగాణలో మాత్రం విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 12నే తెలంగాణ ఇంటర్ ఫలితాలు కూడా వెల్లడవుతాయని ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు.. ఏప్రిల్ 12న ఫలితాలు వెల్లడించే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఇంటర్ ఫలితాల వెల్లడి తేదీలపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ తుదిదశలో ఉందని బోర్డు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరలో ఇంటర్ ఫలితాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1300 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి 9,42,719 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు. కింది వెబ్‌సైట్లలో కూడా ఫలితాలను విడుదల చేయనున్నారు.