YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఓటింగ్ శాతం తగ్గటానికి వరస సెలవేలే ప్రధాన కారణమా?

ఓటింగ్ శాతం తగ్గటానికి వరస సెలవేలే ప్రధాన కారణమా?
వరస సెలవులు మరోసారి ఎన్నికల పోలింగ్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఎప్పుడు లేనివిధంగా నగర ఫరిధిలో పది శాతం పోలింగు తగ్గటం ఇదే మొదటిసారి.హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ పరిధిలోని సికింద్రాబాద్,మల్కాజగిరి,చేవెళ్ల ,హైదరాబాద్ నియోజకవర్గాల లోని ఓటింగ్ శాతం తగ్గటానికి వరస సెలవేలే ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్ సభా నియోజకవర్గాలలో సగటున 60శాతం నమోదయింది.కాని హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 39 శాతం,విద్యాధికులు ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ పార్లమెంటునియోజకవర్గంలో 40శాతం చేవెళ్లలో 50శాతం ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయని అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఎన్నికల సందర్బంగా గురువారాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ప్రకటించటం,శుక్రవారం మినహా శని ఆదివారాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు,ఐటీ ఉద్యోగులకు సెలవు దినం కావటం తో శుక్రవారం ఒక్క రోజు సెలవు పెట్టుకోని మెజార్టీ ఉద్యోగులు నగరం విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికల పోలింగు రోజున కూడా ఇదేవిధంగా వరుస సెలవులు రావటంతో దాని ప్రభావం కూడా అప్పటి పోలింగ్ శాతం తగ్గుదలకు కారణమని అధికారులు విశ్లేషించారు.నగరం నుంచి సుమారు 10లక్షలమంది గత మంగళ, బుధ వారాలలో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్ళినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో రైళ్ల ద్వారా లక్షా ఇరవై ఐదు వేల మంది ప్రయాణించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు సంస్థ,తెలంగాణా రాష్ట్ర రోడ్డు సంస్థలు కలిపి రెండు రోజులు సుమారు 1000 బస్స్సులు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విధ ప్రాంతాలకు నడపగా,తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు అదనపు సర్వీసులను నడిపారు.అలాగే రైల్వే శాఖ కూడా ఎన్నికల సందర్బంగా తెలంగాణనుండి  ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక రైళ్ళు నడిపింది.అదేవిధంగా వందలాది ప్రయివేటు బస్సులు,వేలాది కార్లలో కూడా అనేకమంది తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రంలో కూడా శాసనసభ,పార్లమెంటుకు ఎన్నికలు జరగటం,రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మందికి రెండు రాష్ట్రాలలో ఓట్లు ఉండటంతో అక్కడ ఓటింగులో పాల్గొనటానికి ప్రాధాన్యత ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు.దీనితో పాటు గురువారం రాష్ట్రంలో ఎండలు ప్రభావం  కూడా బాగా ఉండటంతో చాలామంది ఓటింగుకు  దూరంగా ఉన్నారనితెలుస్తోంది.,దీని ప్రభావం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఫలితాలు విడుదల అయ్యేవరకూ వేచి చూడాలని ఒక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.2014సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో నమోదు అయినా ఓటింగుతో పోలిస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజగిరి,చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో పదిశాతం పైగా పోలింగు తగ్గింది.మల్కాజగిరి నియోజకవర్గంలో గత ఎన్నికలో 50. 9శాతం నమోదుకాగా గురువారం జరిగిన ఎన్నికలలో 42.75శాతం,సికింద్రాబాద్ లో గతఎన్నికలలో 53.01సాతంనమోదుకాగా ఈ థపా కేవలం 39. 49శాతం హైదరాబాద్లో 53. 27శాతం గతంలో నమోదు ఐతే ఈ సారి 39. 49శాతం,చేవెళ్లలో 60.22 శాతం నమోదుకాగా గురువారంనాడు జరిగిన ఎన్నికలలో 53.8 శాతం మాత్రమే నమోదు అయింది.                                  .

Related Posts