YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

వివిధ స్థాయిల్లో ఇవిఎంల భద్రత ఎన్నికల అధికారి రజత్ కుమార్

వివిధ స్థాయిల్లో ఇవిఎంల భద్రత           ఎన్నికల అధికారి రజత్ కుమార్
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశవ్యాప్తంగా జరుగుతున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి మొదటి దశలోనే తెలంగాణ లోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయినందున ఇ.వి.ఎం, వివిప్యాట్ యంత్రాల భద్రత, తరలింపువంటి అంశాలలో తీసుకుంటున్న , తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను వివరిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. రజత్ కుమార్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసారు.మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మేడ్చల్ మండలానికి చెందిన కండ్లకోయ గ్రామంలో ఉన్న ఎ.ఎం.సి గోదామును రాష్ట్ర కేంద్ర గోదాముగా గుర్తించడం జరిగింది. ఇక్కడికి తీసుకువచ్చే, ఇక్కడినుంచి తీసుకుపోయే ఇ.వి.ఎంల కదలికలు, ఇక్కడ ఉంచిన వాటికి తగిన భద్రత కల్పించడం వంటివాటినన్నీ ఎప్పటికప్పడు రాజకీయ పార్టీలకు తగిన సమాచారం అందిస్తూ , నిబంధనలను నిక్కచ్చిగా పాటిస్తూ చేయాలి.
భద్రతా నియమాలు :
కేటగిరి-ఎ : ఓట్లతో నిండిన ఇ.వి.ఎంలను పోలింగ్ ముగిసిన తరువాత తగిన విధివిధానాలను పాటించిన తరువాత స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలి.
కేటగిరి-బి : కొన్ని ఓట్లు పోలయిన తరువాత లోపాల కారణంగా తొలగించిన ఇ.వి.ఎంలను తగిన విధివిధానాలను పాటించిన తరువాత కేటగిరీ-ఎ...  ఇ.వి.ఎంలతోపాటే, విడిగా భద్రపరచాలి.
కేటగిరి-సి : పోలింగ్ ప్రారంభానికి ముందే లోపాలు బయటపడి తొలగింపబడిన  ఇ.వి.ఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో కాకుండా వేరే గదిలో భద్రపరచాలి. తరువాత తగిన విధివిధానాలు అనుసరించి వాటిని సంబంధిత తయారీదారుకు తిప్పి పంపాలి.
కేటగిరి-డి : ముందు జాగ్రత్తగా అదనంగా తెప్పించి, పోలింగ్‌కు అసలు ఉపయోగించకుండా సెక్టార్/జోనల్/ ఏరియా మేజిస్ట్రేట్ దగ్గర రిజర్వ్ లోఉన్న ఇ.వి.ఎంలను స్ట్రాంగ్ రూమ్ లో కాకుండా విడిగా మరో గదిలో భద్రపరచాలి.
పోలింగ్ ముగిసిన తరువాత కేటగిరీ – డి  ఇ.వి.ఎంలను అంటే – వాడకుండా రిజర్వులో ఉంచిన వాటిని, శిక్షణకు, అవగాహనకు ఉపయోగించిన వాటిని  అన్ని జిల్లాలనుంచి తెప్పించి కేంద్ర గోదాములో సాయుధ కాపలాతో భద్రపరచాలి.
 పోలింగ్ తరువాత ఇ.వి.ఎంల భద్రతా ఏర్పాట్లు :
ఇ.వి.ఎంలను ఉంచిన ప్రదేశం చుట్టూ తొలి భద్రతావలయాన్ని కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు(సిపిఎఫ్) రాత్రింబవళ్ళు కాపలా కాయాలి. దాని తరువాత వలయాన్ని రాష్ట్ర సాయుధ దళం కాపలా కాస్తుంది. ఆ రెండింటి చుట్టూ ఉన్న ప్రాంత వలయాన్ని జిల్లా ఎగ్జిక్యూటివ్ దళం కనిపెట్టుకుని ఉంటుంది. ఓట్లతో ఉన్న ఇ.వి.ఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లవద్ధ  కనీసం ఒక ప్లటూన్ ఉండాలి. పరిశీలకులు లేదా జిల్లా ఎన్నికల అధికారులు లేదా పోలీస్ సూపరింటెండెంట్‌లు లేదా వారి ప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులతో సహా  ఎవరయినా తొలి భద్రతా వలయంలోకి వెళ్ళిరావాలంటే దానికి తగిని నియమాలను తు.చ.తప్పకుండా పాటించాలి.  రెండో(మధ్య) భద్రతా వలయం దాటేవారి పేరు, తేదీ, సమయం, వ్యవధి అన్నీ సిపిఎఫ్ నిర్వహించే లాగ్ బుక్‌ లోవివరంగా పేర్కొనాలి. ఇటువంటి సందర్శనలను వీడియోగా చిత్రీకరించడానికి సిపిఎఫ్ వారికి తగిన పరికరాలు ఇవ్వాలి. స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించాలనుకునే అభ్యర్థుల ఏజంట్లను సిసిటివిద్వారా చూడడానికి అనుమతించవచ్చు. దీనిని కూడా లాగ్ బుక్ లో నమోదు చేయాలి.
స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ పద్ధతి ఉండాలి. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, మరొకటి సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలూ ఒక కంట్రోల్ రూమ్ పనిచేస్తుండాలి. ఒక పోలీస్ అధికారితోపాటూ, ఒక గెజిటెడ్ అధికారి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండాలి. స్ట్రాంగ్ రూమ్‌ లోనికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఒకే ద్వారం ఉండాలి. అగ్నిమాపక దళం తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ ల భద్రతకు, ప్రొటోకాల్ అమలుకు-జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు బాధ్యులు
రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజూ స్ట్రాంగ్ రూమ్‌ ప్రాంగణాన్ని అంతర్ వలయం(తొలి వలయం)వరకు ఉదయం, సాయంత్రం వెళ్ళి లాగ్ బుక్ ను, వీడియో చిత్రీకరణను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలి. ఇ.వి.ఎంలు భద్రపరిచిన ప్రాంగణంలోకి ఏ అధికారికి, మంత్రికి, లేదా మరే ఇతర రాజకీయ నాయకులకు చెందిన వాహనాలను అనుమంతించ కూడదు.
ఓట్ల లెక్కింపు జరిగే రోజున, అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఆర్.ఓ, పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో స్ట్రాంగ్ రూమ్ ను తెరవాలి. ఇవిఎంలను కౌంటింగ్ కోసం బయటికి తీయడం, అది ముగిసిన తరువాత తిరిగి వాటిని తీసుకొచ్చి అక్కడ భద్రపరిచే కార్యక్రమాన్నంతా పూర్తిగా వీడియో తీయాలి.
కౌంటింగ్ ముగిసిన తరువాత  నిబంధనల ప్రకారం ఇ.వి.ఎంలను(బ్యాలట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు), వివిప్యాట్‌లను సీల్ వేసి  భద్రపరచడానికి తిరిగి స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చాలి.
అభ్యర్థులకు ఎన్నికల సంఘానికి చెందిన సిఇఓ, అదనపు సిఇఓలు, డిఇసి ఇంచార్జిలు, సంబంధిత డిఇఓ, ఎస్.పి, సిఒపి, ఆర్.ఓ ల ఫోన్లనెంబర్లు ఇవ్వాలి. ఈ నియమనిబంధనల ప్రతులను అభ్యర్థులందరికీ, డిఇఓలకు, ఆర్.ఓలకు, సిపిఎఫ్ కమాండెంట్ కు అందచేయాలి.

Related Posts

0 comments on "వివిధ స్థాయిల్లో ఇవిఎంల భద్రత ఎన్నికల అధికారి రజత్ కుమార్"

Leave A Comment