YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్

పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాష్ట్రంలోని జెడ్పిటిసి-ఎంపిటిసి ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 22 శాతం నుండి 34 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కు విజ్ఞప్తి చేశారు.  ఈ రోజు బి.సి భవన్ లో జరిగిన రాష్ట్ర బి.సి సంఘర్షణ సమితి విస్త్రుత స్థాయి సమావేశానికి సoఘo అద్యక్షులు చెరుకుల రాజేందర్ అద్యక్షత వహించారు. రిజర్వేషన్ల సమస్య పరిష్కారమయ్యే వరకు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22 శాతం తగ్గించి ఎన్నికలు జరపడంతో బీసీలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. కనీసం ఇప్పుడు జెడ్పిటిసి-ఎంపిటిసి ఎన్నికలనైన బీసీ రిజర్వేషన్లను గతంలో మాదిరిగా 34% పునరుద్దరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం 32 జిల్లా పరిషత్తు లకు 535 ఎంపిటిసి లకు, 5857 జెడ్పిటిసి- లకు ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జెడ్పిటిసి-ఎంపిటిసి ఎన్నికలలో బి.సి రిజర్వేషన్లు లెక్కించడంలో కూడా అన్యాయం చేస్తున్నారు. 32 జిల్లా పరిషత్ లలో బి.సిలకు 22.9 % చొప్పున లెక్కిస్తే ఏడు జిల్లా పరిషత్ రావాలి. కాని 6 మాత్రమే కేటాయించారు. అవికూడా ప్రాదాన్యత లేని చిన్న జిల్లాలను బి.సిలకు కేటాయించారు. అలాగే ఎంపిటిసి లను లెక్కించడంలో కూడా పంచాయత్ రాజ్ శాఖ అధికారులు బి.సిలకు ఉద్దేశ్యపూర్వకంగా అన్యాయం చేస్తున్నారు. భద్రాచలం, ఖమ్మం, నల్గొండ, అదిలాబాదు, మంచిర్యాల జిల్లాలలో 10 శాతం ఎంపిటిసి లను కూడా  బి.సి లకు కేటాయించలేదు. అడుగడుగున బి.సిలకు అన్యాయo చేస్తున్నారని కృష్ణయ్య విమర్శించారు. బి.సిలకు ఇంత అన్యాయo జరుగుతుంటే కూడా అధికార పార్టీలో యున్న బి.సి మంత్రులు-శాసనసభ్యులు నోరుమెదపడం లేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. నిలదీయడం లేదని కృష్ణయ్య విమర్శించారు.
సుప్రీంకోర్టులో  పంచాయత్ రాజ్ కేసు సందర్బంగా 2010 లో ఎస్సీ/ఎస్టీ/బిసి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించి రాదు అంటూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో ఈ సందర్భంగా ఒక మినహాయింపు ఇస్తూ జనాభా లెక్కల వివరాలు సమగ్రంగా ఉంటె జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చునని తీర్పు చెప్పింది. ఈ వాస్తవాన్ని మన రాష్ట్ర పంచాయతీరాజ్ కేసు సందర్బంగా హైకోర్టు - సుప్రీం కోర్టులో వాదించే సమయంలో ప్రభుత్వ అడ్వకేట్లు ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించ లేదు. తెలంగాణ ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పుడు బీసీ జనాభా 52% అని తేలింది. ఈ వివరాలు కోర్టు ముందు పెట్టి ప్రభుత్వ అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపిస్తే ఖచ్చితంగా కేసు  గెలుస్తుంది. ప్రస్తుతం హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న కేసును బెంచ్ మీదకు తెచ్చి ప్రభుత్వం ఇప్పటికైన తన వాదనలు వినిపిస్తే కేసు గెలుస్తుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును విచారణ చేపట్టాలని కోరారు. అలాగే ఇంకొక ప్రత్యామ్యాయo ఉంది. ఇటీవల కేంద్రప్రభుత్వం అగ్ర కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు పెడుతూ రాజ్యాంగ సవరణ చేశారు. దీంతో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్ తొలగిపోయింది. ఇప్పుడు రిజర్వేషన్లను 60 శాతం సీలింగ్ వరకు పెంచారు. దీనివలన న్యాయ పరమైన అవరోధాలు తొలగిపోతాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని కూడా బీసీ రిజర్వేషన్లు 34 శాతంకు పెంచుతూ యధా, తధంగా  కొనసాగించవచ్చును. ఈ రాజ్యాంగ సవరణతో న్యాయ పరమైన అవరోధాలు తొలగిపోయాయి.  ఇక రెండవ ప్రత్యామ్నాయం రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్ లు యథాతథంగా అమలు చేయ వచ్చును. ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి ప్రధాన మంత్రితో చర్చలు జరిపి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి. ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే చాలా సులభంగా చేయగలుగుతారు. ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కనీసం ఇకముందు జరిగే ఎంపీటీసీ/జెడ్పీటీసీ/మండల పరిషత్/జిల్లా పరిషత్ చైర్మన్/మున్సిపల్  ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

Related Posts