YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ కు అవినీతి గుర్తుకు రాలేదా!

 గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ కు అవినీతి గుర్తుకు రాలేదా!

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ కు అవినీతి గుర్తుకు రాలేదా అని ఎంఎల్సి టి.జీవన్ రెడ్డి ప్రశ్నించారు.రెవెన్యూ వ్యవస్థను అతలాకుతలం చేసిన కేసీఆర్ సెక్రటేరియట్ కు రాకుండా  పాలన వ్యవస్థను ప్రశ్నించడం విడ్డురంగా ఉందన్నారు.శుక్రవారం గాంధీ భవన్ ల్లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ జిల్లాలను  కన్ఫర్డ్ ఐఏఎస్ లతో నడిపిస్తున్నారని,కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత  సమాచార హక్కు చట్టం ను నిర్వీర్యం చేశారని విమర్శించారు.స్థానిక సంస్థల అభివృద్ధి రాజకీయ పార్టీల బాధ్యత ఎలా అవుతుంది కేసీఆర్ సమాధానం చెప్పాలని జేవన్ రెడ్డి డిమాండ్ చేసారు.మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కిటిఅర్ కు ఇన్ని రోజులు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు,సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్  మంత్రి అనుమతి తో లంచం తీసుకుంటున్న అని చైర్ పర్సన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసారు.ముందస్తు ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు పెట్టారు.. అవ్వి ఎక్కడ నుండి వచ్చాయి..కమిషన్ లతో సంపాదించిన సొమ్మును ఎన్నికలకు ఖర్చు పెట్టారు..చెప్పాలని డిమాండ్ చేసారు.నువ్వు అవినీతి చేసుకుంటా అధికారులను తప్పు పట్టడం విడ్డురంగా ఉందన్నారు.సమాచార హక్కు చట్టం ను బలోపేతం చేయాలని,ముఖ్య మంత్రి కేసీఆర్  సెక్రటేరియట్ రానాన్ని రోజులు పాలన మీద అవగాహన రాదన్నారు.రాజకీయ వ్యవస్థ తోనే అవినీతి అంతం మొందుతుందని పేర్కొన్నారు.

Related Posts