
మందకృష్ణ మాదిగ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని విమర్శించారు. నిన్న పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం దారుణమని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం వెనుక కుట్ర దాగి ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.