
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జగిత్యాలలో దారుణం జరిగింది. పట్ట పగలు నడిరోడ్డుపై.. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని అడ్డగించి.. గొడ్డలితో దాడి చేయడం కలకలంరేపింది. ఆదివారం ఘటన జరగ్గా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం బయటపడింది. తీవ్ర గాయాలైన బాధితుడ్ని స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భూ తగాదాలతోనే బాధితుడిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. జగిత్యాలలోని మార్కండేయ వీధికి చెందిన తిప్పర్తి కిషన్‌కు జగిత్యాల రూరల్ మండలం ఆనంతారాంకు చెందిన కత్రోజు లక్ష్మణ్ అనే వ్యక్తితో భూతగాదాలు ఉన్నాయట. ఈ తగాదాలతోనే కిషన్‌పై లక్ష్మణ్ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా వీడియో ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు.