YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఎంపిటిసి ఎన్నికలు జరపాలి జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఎంపిటిసి ఎన్నికలు జరపాలి జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్
 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
హైకోర్టు లోని కేసు తీర్పు వచ్చిన తర్వాతనే ఎంపిటిసి-జెడ్పిటిసి ఎన్నికలు జరుపాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షుడు  ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు.ఈ మేరకు పంచాయత్ రాజ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరికి లేఖా రాసారు.ఈ సందర్బంగా ఎన్నికలకు సంబంధించి పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుక వచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లును 34 శాతం నుంచి 22 శాతం కు తగ్గించి ఎన్నికలు జరిపారు. దీని మూలంగా రాష్ట్రంలో 1600 సర్పంచ్ పదవులు 20 వేల వార్డు మెంబర్లు బి.సిలకు దక్కకుండ పోయాయి. రాష్ట్రంలో బీసీలు 52 శాతం ఉంటే 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 22 శాతం తగ్గించారు. దీనితో బీసీ కులాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కనీసం ఇప్పుడు ఎంపిటిసి-జెడ్పిటిసి ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుపాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిటిసి-జెడ్పిటిసి ఎన్నికలకు పోవాలని తొందర పడుతుంది. కోర్టు తీర్పు ప్రకారం ప్రస్తుతం బి.సి రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతం కు తగ్గిoచారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు లో పెండింగ్ లో ఉంది. మారిన పరిస్థితుల దృష్యా కోర్టును మరోసారి రిజర్వేషన్లను యధా, తధంగా కొనసాగించాలని కోర్టును కోరాలని పేర్కొన్నారు.సుప్రీంకోర్టులో  పంచాయత్ రాజ్ కేసు సందర్బంగా 2010 లో ఎస్సీ/ఎస్టీ/బిసి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించి రాదు అంటూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో ఈ సందర్భంగా ఒక మినహాయింపు ఇస్తూ జనాభా లెక్కల వివరాలు సమగ్రంగా ఉంటె జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చునని తీర్పు చెప్పింది. ఈ వాస్తవాన్ని మన రాష్ట్ర పంచాయతీరాజ్ కేసు సందర్బంగా హైకోర్టు - సుప్రీం కోర్టులో వాదించే సమయంలో ప్రభుత్వ అడ్వకేట్లు ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించ లేదు. తెలంగాణ ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పుడు బీసీ జనాభా 52% అని తేలింది. ఈ వివరాలు కోర్టు ముందు పెట్టి ప్రభుత్వ అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపిస్తే ఖచ్చితంగా కేసు  గెలుస్తుంది. ప్రస్తుతం హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న కేసును బెంచ్ మీదకు తెచ్చి ప్రభుత్వం ఇప్పటికైన తన వాదనలు వినిపిస్తే కేసు గెలుస్తుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.అలాగే ఇంకొక ప్రత్యామ్యాయo ఉంది. ఇటీవల కేంద్రప్రభుత్వం అగ్ర కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు పెడుతూ రాజ్యాంగ సవరణ చేశారు. దీంతో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్ తొలగిపోయింది. ఇప్పుడు రిజర్వేషన్లను 60 శాతం సీలింగ్ వరకు పెంచారు. దీనివలన న్యాయ పరమైన అవరోధాలు తొలగిపోతాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని కూడా బీసీ రిజర్వేషన్లు 34 శాతంకు పెంచుతూ యధా, తధంగా  కొనసాగించవచ్చును. ఈ రాజ్యాంగ సవరణతో న్యాయ పరమైన అవరోధాలు తొలగిపోయాయి.  కోర్టు దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావాలన్నారు. ఇక సమస్య శాశ్వత పరిష్కారం రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్ లు యథాతథంగా అమలు చేయ వచ్చును. ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి ప్రధాన మంత్రితో చర్చలు జరిపి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి. ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే చాలా సులభంగా చేయగలుగుతారని పేర్కొన్నారు.అయితే ఈ రిజర్వేషన్లు తగ్గకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నవి. పైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కనీసం ఇకముందు జరిగే ఎంపీటీసీ/జెడ్పీటీసీ/మండల పరిషత్/జిల్లా పరిషత్ చైర్మన్/మున్సిపల్  ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  వెంటనే హైకోర్టులో పెండింగులో ఉన్న కేసును బెంచ్ మీదకు తెచ్చి వాధనలు వినిపించి కేసు తీర్పు తొందరగా వచ్చేటట్లు చూడగలరని విజ్ఞప్తి చేసారు.పైన పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్లు గతంలో మాదిరిగా 34 శాతం కు  పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.

Related Posts