
బొలెరో వాహనం బోల్తా పడి 36 మందికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ - ఇల్లందు ప్రధాన రహదారి గంధం పల్లి గ్రామ సమీపంలో లో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి కొత్త తండాకు చెందిన వీరంతా తిరుపతికి కి కృష్ణ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేసేందుకు బయలుదేరారు. మహబూబాబాద్ వస్తుండగా బోలేరో టైరు పగిలిపోయింది, దాంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు మెరుగైన వైద్య సహాయం కోసం ఆర్టీసీ బస్సులో మానుకోట ప్రభుత్వ దవాఖానకు చేరుకొని చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 11 నెలల బాలుడికి చేయివిరిగింది. అత్యధిక మందికి తలకు గాయాలయ్యాయి.