YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పోలింగ్ పర్సంటేజ్ పై ఈసీ ఆగ్రహం

పోలింగ్ పర్సంటేజ్ పై ఈసీ ఆగ్రహం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రజాస్వామ్యం పై మనందరికీ నమ్మకం ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా లో  పోలీంగ్ పర్సంటేజ్ పై అసత్య ప్రచారం పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసారు.  పోలింగ్ జరిగిన రోజే పోలింగ్ పర్సంటేజ్ అంత కరెక్ట్ గా తెలియదు. ఎస్టిమేట్ మాత్రమే చెప్తాం. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే యస్టిమేషన్ పోలింగ్ పర్సంటేజ్ ఎంత అని ఛీఫ్ ఎలక్షన్ కమీషన్ అడుగుతుంది. కాబట్టి మేము యస్టిమేషన్ పర్సంటేజ్ చెప్తాం. 17ఎ ,17 సీ కాపీ ప్రతీ పోలింగ్ ఏజెంట్ కు  ఇస్తాం. పోలింగ్ అయిపోయాక పోలింగ్ ఏజెంట్ ల సంతకం రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకుంటాడని అయన వివరించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలు ,17ఎ ,17సీ కాపీ లను సీల్ వేసి స్ట్రాంగ్ రూం లో భద్రపరిచాం. అసత్య ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా పై కేసులు బుక్ చేసామని అన్నారు. జగిత్యాల లో ఆటోలో తీసుకెళ్తున్న ఈవీఎం ట్రేనింగ్ పర్పస్ కోసం వాడింది. నాలుగు రకాల ఈవీఎంలు ఉంటాయి. ఎ క్యాటగిరి ఈవీఎంలు మాత్రమే పోలింగ్ కు వాడుతున్నాం. వంద మీటర్ల లోపు పోలింగ్ బూత్ ల వద్దకు వాహానాల అనుమతి లేదు. మాక్ పోలింగ్ లో ఫెయిల్ అయిన ఈవీఎంలను సీ క్యాటగిరి ఈవీఎంలు గా పరిగణిస్తాం. వాటిని వెంటనే కలెక్టర్ కార్యాలయానికి తరలిస్తామని అన్నారు. కీసర స్ట్రాంగ్ రూంలో టిఆర్ఏస్  వ్యక్తి  వెళ్ళిన సందర్భం వేరు. స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలు పెట్టే ముందు అన్ని రాజకీయ పార్టీల వారు పరిశీలిస్తారు. ఆ సంధర్భంలోనే ఆయన ఫోటో తీసుకున్నాడని అయన అన్నారు. పోల్ అయిన ఓట్ల లో నోటా ఓట్లను తొలగించి పర్సంటేజ్ లెక్కిస్తాం. పొలిటికల్ మోటివేషన్ తో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని రజత్ కుమార్ అన్నారు.

Related Posts