
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గత వారం రోజుల నుండి ఎండలు తీవ్రంగా ఉడటంలో మమనుషులతో పాటు పశుపక్ష్యాలు విలవిలలాడుతున్నాయి. రోజూ ఉదయం నుంచే సర్యుడు తన ప్రతాపం చూపడంతో బయట తీరగడనికి జనాలు జంకుతున్నారు. ఇక ఈ ఎండ దాటికి తట్టుకోలేక కామారెడ్డి జిల్లా సిద్దం మండలం నాగంపల్లి శివారులో జాతీయ పక్షులు మరణించాయి. కామారెడ్డి జిల్లా సిడ్లం మండలం లోని నాంగపల్లి శివవారులో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో వన్యమృగాలతో పాటు నెమళ్లు కుడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎండలు విపరీతంగా కాయడం తో వన్యప్రాణులన్నీ విల విలలాడుతున్నాయి. అటవీ ప్రాంతంలలో ఉన్న చెరువులు, కుంటలలో నీరు అడుగుఅంటిపోయింది. దాంతో అటవీ జంతువులు తాగునీటి కోసం గ్రామాల వైపు పరుగుల తీస్తున్నాయి. కొన్ని ప్రాణాలు విడుస్తున్నాయి. నెమళ్లు చనిపోయిన విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న అటవీ అధికారులు జాతియ పక్షుల కళేబరాలు పరిశీలించారు. ఎండ వేడిని తట్టుకోలేని ఈ పక్షులు మరణించి ఉంటాయని అటవీ అధికారులు తెలిపారు.