
జిల్లా లోని మల్యాల మండలం కొండగట్టుపై నాలుగు రోజుల క్రితం ఒకగుర్తు తెలియని మహిళా మృతి చెందింది. అక్కడి స్ధానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు .నాలుగు రోజులు అయినప్పటికీ ఎవరు రాకపోవడంతో పోలీసులు ఆనాథ శవంగా నిర్థారించారు. ఈవిషయం తెలుసుకున్న జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులకు పోలీసు,మున్సిపల్ అధికారుల ఆనుమతితో మృతదేహాన్ని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు .ఈసందర్భంగా మల్యాల ఎస్సై ఉపేందర్ చారి అభినందించారు.ఈకార్యక్రమంలో స్వచ్ఛంద వ్యవస్థాపకుడు డెక్క శ్రవన్ ,గొర్రె వివేక్ ,నల్ల సురేష్, దాసరి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.