YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పిల్లల్ని చంపిన కన్న తండ్రి

పిల్లల్ని చంపిన కన్న తండ్రి
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అర్ధరాత్రి మానవత్వం మంటకలిసింది. కాపాడిల్సిన కన్న తండ్రే తాను కన్న పిల్లల్నే కత్తితో హత మార్చిన ఘటన రామచంద్రాపురంలో  తీవ్ర కలకలం రేపింది. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఈఎస్సై  ఆసుపత్రి ఎదురుగా బాంబే కాలనీ లో ఈ దారుణం జరిగింది. భార్య భర్తల మధ్య విభేదాలతో నెల రోజుల క్రితం ఎరుకుల కుమార్ భార్య  భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్ కి ముగ్గురు పిల్లలు. మంగళవారం ఆర్ధరాత్రి  మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కుమార్  కత్తితో దాడి చేసి తన కన్న పిల్లల్నే కడతేర్చాడు. కుమారుడు అఖిల్ (7), చిన్న కుమార్తె  శరణ్య (4) లను కత్తితో గొంతు కోసి, చిన్న కూతురు  గొంతుకు తాడుతో ఉరి బిగించడం తో అక్కడికక్కడే మృతి చెందారు.  పెద్ద కూతురు మల్లీశ్వరి పై కత్తితో దాడి చేసాడు. అయితే,  తండ్రిని మాటల్లో పెట్టి  తెలివితో కత్తి దాడిని మల్లీశ్వరి తప్పించుకుంది. మల్లీశ్వరి మెడకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే స్థానికులు చితక బాది పోలీస్ లకు అప్పజెప్పారు. పోలీసులు నిందితుడు కుమార్ ను అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని , మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు.

Related Posts