
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
బాగ్‌లింగంపల్లిలోని సరోజిని క్రికెట్, టెన్నిస్ అండ్ ఫిట్‌నెస్ అకాడమీ విద్యార్ధి సన్నీత్ ఉప్పాటి క్రీడా నైపుణ్యాన్ని చాటుకుంటున్నాడు. తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వంటైజ్ టెన్నిస్ అకాడమీ నేరెడ్‌మెడ్‌లో నిర్వహించిన మాస్టర్ సీరిస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సన్నీత్ మరోమారు విజయకేతనం ఎగురవేశాడు. పదిహేను ఆటలలో సనేట్ టాప్ సీడ్ లో గెలిచాడు. ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగిన ఈ పోటీలో సన్నీత్ అండర్-14లో పై చేయి సాధించాడు. స్కోర్‌ను పరిశీలించినట్‌నయితే... సన్నీత్ క్వాటర్ ఫైనల్‌లో యశ్వంత్‌తో తలపడి 8-4తో నెగ్గాడు. సెమీ ఫైనల్‌లో రిషి శర్మతో పోటీపడి 8-5 స్కోర్‌తో విజయం సాధించాడు. చివరగా ఫైనల్‌లోనూ తన సత్తా చాటుకున్నాడు. శాంత్ శరన్‌తో తలపడి 8-3తో జయకేతనం ఎగురవేశాడు. ఈ టోర్నమెంట్లో సన్నీత్ బ్యాక్హ్యాండ్ అద్భుతంగా ఉంది. ప్రత్యర్థి వర్గాన్ని తన మెరుగైన ఆటతో ఓడిండి టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతను ఉదయం, సాయంత్రం వేళలో తప్పని సరిగా ఆటల్లో అభ్యాసం చేస్తాడు. అకాడమీ కార్యదర్శి జి.ఆర్.కిరణ్ సన్నీత్‌కు మెరుగైన ఆట తీరుతెన్నులను వివరిస్తూ వ్యక్తిగతంగా పర్యవేక్షించడంతో అద్భుతమైన క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాడు. టెన్నిస్ కోచ్ లు పురుషోత్తం, బోలాసింగ్, ఇమ్రాన్, ప్‌ంసాద్ వద్ద శిక్షణ పొందుతున్నాడు.జాతీయ వాలీబాల్ క్రీడాకారులు, సరోజిని అకాడమీ కార్యదర్శి, టి.ఎస్.ఆర్టీసీ సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి.కిరణ్ రెడ్డి సన్నీత్ ఉప్పాటి జి. కిరణ్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోనూ మంచి క్రీడాకారుడిగా ఎదగడానికి మరింత కష్టపడాలని ఆయన సలహా ఇచ్చారు. సన్నీత్ స్పందిస్తూ, తనను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, కోచ్ లకు కృతజ్ఞతా భావాన్ని వ్యక్త పరిచాడు.