
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ఐదు జడ్పిటిసి , ఎంపీటీసీ స్థానాల్లో మనమే అగ్రస్థానంలో ఉండాలని.. సిద్దిపేట లో ఏ విజయం అయిన...ఏ ఎన్నిక అయిన ఎగేరెది గులాబి జెండానేనని.. మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.. సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హల్ లో బుధవారం చిన్నకొడూర్ , నంగునూర్ మండలాల ప్రజాప్రతినిధులు , పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నింటి లో ఆదర్శంగా నిలుస్తున్న మనం ఈ జడ్పిటిసి , ఎంపీటీసీ ఎన్నికలో రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు , సర్పంచ్ ఇతర నాయకులతో కల్సి ఎవరన్నది నిర్ణయం తీసుకోని ఐక్యత కు మారు పేరుగా నిలవాలన్నారు.. నేను ఎప్పుడూ కోరుకునేది ఒకటే నా కార్యకర్తలు నేను ఒక కుటుంబం..ఆ కుటుంబం లో అందరం బాగుండాలని అనుకుంటా..అలానే అందరూ ఉండాలని నా ఆలోచన.. ఎన్నికలతో గ్రామంలో అందరూ సమన్వయం తో ఒక వ్యక్తి ని నిర్ణయచండి కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా చూస్కోవాలి...పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారికి పార్టీ సైనికులుగా పని చేయాలి అప్పుడే పార్టీ కార్యకర్తలు గా మనకు గుర్తింపు వస్తుందన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ కి కట్టుబడి ఉండి పని చేయాలి.. పని చేసే ప్రతి కార్యకర్త కు గుర్తింపు ఉంటుంది.. ప్రతి నాయకుణ్ణి, ప్రజాప్రతినిధిని , కార్యకర్తను కంటికి రెప్పలా చూస్కుంటా.. నా ఎన్నికల్లో మీరు కష్టపడ్డారు..మీ ఎన్నికలో నేను కష్ట పడ్తా..గ్రామ ఎంపిటిసి అభ్యర్థి ఎంపీక ..నిర్ణయం మీ చేతుల్లోనే ఉందన్నారు.. అందరూ కలసి ఎవరిని సూచిస్తే వారికి పార్టీ టికెట్.. లేదంటే పార్టీ ఎవరిని సూచించిన వారి గెలుపు అందరూ కలసి పని చేయాలన్నారు. మన నియోజకవర్గంలో 45 ఎంపీటీసీ స్థానాల్లో.. ఐదు జడ్పిటిసి స్థానంలో అధిక మెజార్టీ లో మనమే గెలవాలి..సిద్దిపేట అంటే విజయం...ఎన్నికలు కొత్త కాదు..ఎన్నిక ఏది అయిన టి ఆర్ ఎస్ దే విజయం అని మరో సారి మన గౌరవాన్ని నిలిపి రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలి అని పిలుపునిచ్చారు...
- బ్యాంక్ లో డిపాజిట్ చేసిన డబ్బులు... మీ దగ్గర నా గుర్తింపు ఒకటే... !
మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసిన డబ్బులు... మీ దగ్గర నా గుర్తింపు ఒకటే అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ శ్రేణులను ఉదేశించి అన్నారు.. మీరు బ్యాంక్ లో డబ్బులు వేసి ఉంచితే ఎప్పటికి అలానే ఉంటాయి.. మిత్తి తో సహా తీసుకోవచ్చు అని..అట్లానే మీ గుర్తింపు నాకు వదిలి పెట్టండి..నాదగ్గర అలానే ఉంటుంది.. ఎప్పటికైనా పార్టీలో ఎదో ఒక పదవి, గౌరవం ఇస్తానని ఈ సందర్భంగా కార్యకర్తలకు భరిసానిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకిషన్ శర్మ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు సమన్వయం తో పనిచేయాలన్నారు. నాయకులు రాగుల సారయ్య, సోమిరెడ్డి, మాణిక్యారెడ్డి, కోమాండ్ల రాంచంద్రారెడ్డి, రామచంద్రం, మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, శ్రీహరియాదవ్, కాముని శ్రీనివాస్, లు మాట్లాడారు. కార్యక్రమంలో
సత్యనారాయణరెడ్డి, వేముల వెంకట్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, కిష్టారెడ్డి, పాపయ్య, రాజిరెడ్డి, తడిసిన వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.