
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఉప్పల్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఏషియన్ సినిమా హాల్ దగ్గర జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామంతాపూర్కి చెందిన రామావత్ హరినాయక్ (38) అక్కడికక్కడే మృతి చెందాడు. సమచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.