
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద డీసీఎం వ్యానులో తరలిస్తున్న గంజాయిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ కోటి 68లక్షలు ఉంటుందని అంచన. సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు హైదరాబాద్ డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. డీసీఎం వ్యానులో ఇటుకల మధ్య గంజాయిని ఉంచి తరలిస్తుండగా పట్టుకున్నారు. రూ.1,68,22,500 విలువ చేసే1121.5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.