
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అంతర్జాతీయ లఘు చిత్రాల తయారి ఫై ఇండి వుడ్ టాలెంట్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.లఘు చిత్రాల తయారీ ఫై ప్రత్యేక మైన ఆసక్తి గల వారందరిని దీనిలో భాగస్వామ్యం చేస్తామని,నటులు,ప్రొడక్షన్ సిబ్బందితో పాటు అందరికి అవకాశం కలిపిస్తామని సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ పోటీలను మూడు రకాలుగా విభాజించమని, వృత్తి రిత్యా లఘు ఫిలిం తయారి 72 గంటలు, ఎమ్యుచార్ లఘు చిత్రం తయారికి 72 గంటలు, మొబైల్ లఘు చిత్రం తయారి ఫై పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.గెలుపొందిన విజేతలకు లక్ష 50 వేలు,లక్ష రూపాయలు,50 వేల రూపాయలు పారితోషకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. బెస్ట్ షార్ట్ ఫిలిం లకు మూడు కేటగిరిల్లోను ఆగష్టు నెలలో తొలి జాబితా నిర్వహిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.