
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి సాయంత్రం అయిదు గంటలకు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో బాలికలదే పైచేయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,70,575 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 29 శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందేగ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 3,91,048 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 1,90,475 మంది ఫస్ట్ ఇయర్, 2,00,573 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఫలితాలపై వరుస సెలవులు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితాల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శింవచ్చని హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి జయప్రదబాయి స్పష్టం చేశారు