YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

20న మండల పరిషత్, జిల్లా పరిషత్ షెడ్యూల్

20న మండల పరిషత్, జిల్లా పరిషత్ షెడ్యూల్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 20న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్ 22న తొలివిడత నోటిఫికేషన్ విడుదలవుతుంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 6న తొలి విడత,10న రెండో విడత, 14న మూడో విడత పోలింగ్ జరగనుంది.  మే 23 తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.కాగా, ఈ ఎన్నికల్లో 1,56,11,320 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 32,007 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 539 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. 
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు అయింది. మొత్తం 535 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 20వ తేదీన షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నెల 22న మొదటి విడుత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మొదటి విడుతలో భాగంగా 212 జడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడుత నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 26న విడుదల కానుంది. రెండో విడుతలో భాగంగా 199 జడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 30న మూడో విడుత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మూడో విడుతలో భాగంగా 124 జడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీ స్థానాలకు మే 14న పోలింగ్‌ జరగనుంది. 400 మంది వరకు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 6,540 ఉండగా.. 600 మంది వరకు ఓటర్లున్న కేంద్రాలు 25,467 ఉన్నాయి. మొత్తం 32,007 పోలింగ్ కేంద్రా ల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్లుగా 64,014 మందిని నియమించారు. అదేవిధంగా 400 మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రానికి ముగ్గురు, 600 మంది ఓటర్లున్న కేంద్రాలకు నలుగురు చొప్పున 1,21,488 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 1,47,141 మంది పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు ఎస్‌ఈసీ పేర్కొంది. మొత్తం 13,651 పో లింగ్ లోకేషన్లను ఏర్పాటుచేశారు. 510 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, 129 లెక్కింపు కేంద్రా లు, స్ట్రాంగ్ రూంలను సిద్ధంచేశారు.
ఒకే విడుతలో ఎన్నికలు జరిగే జిల్లా: మేడ్చల్ మల్కాజిగిరి
రెండు విడుతల్లో జరిగే జిల్లాలు: జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ అర్బన్.
మూడు విడుతల్లో జరిగే జిల్లాలు: ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ములుగు.

Related Posts