YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్‌ ఓడిపోతారు : కాంగ్రెస్‌ నేత జెట్టి

బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్‌ ఓడిపోతారు : కాంగ్రెస్‌ నేత జెట్టి
బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్‌ ఓడిపోతారని కాంగ్రెస్‌ నేత జెట్టి కుసుమ కుమార్‌ అన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో కేసీఆర్‌పై జెట్టి విమర్శలు చేశారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్తకుప్పలో వేస్తే కేసీఆర్‌ కనీసం స్పందించలేదని జెట్టి కుసుమ కుమార్‌ విమర్శించారు. జెడ్పీ చైర్మన్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నేత జెట్టి కుసుమ కుమార్‌ డిమాండ్ చేశారు. జిల్లాల్లో జెడ్పీటీసీ సభ్యుల కంటే ఎక్స్‌అఫిషియో సభ్యులే ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు. చిన్న జిల్లాల్లో ఎక్స్అఫిషియో సభ్యుల ఆధారంగా జెడ్పీలు కైవసం చేసుకునే కుట్ర జరుగుతోందని కుసుమ కుమార్‌ ఆరోపించారు. మేడ్చల్ జిల్లాలో జెడ్పీటీసీలు నలుగురుంటే ఎక్స్అఫిషియో మెంబర్ల ఏడుగురున్నారని ఆయన అన్నారు.

Related Posts