YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అటవీ శాఖ సిబ్బందికి రోటరీ క్లబ్ విశిష్ట సేవా అవార్డులు

అటవీ శాఖ సిబ్బందికి రోటరీ క్లబ్ విశిష్ట సేవా అవార్డులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన రోటరీ క్లబ్ ప్రతీ యేటా ఇచ్చే అవార్డులను ఈ యేడాది వినూత్నంగా జరిపింది. ఏటా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి రోటరీ క్లబ్ తరపున అవార్డులతో సన్మానించటం ఆనవాయితీ. అయితే ఈ యేడాది  క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ పర్యావరణం, అటవీ రక్షణకు తోడ్పడిన అటవీ శాఖకు చెందిన కింది స్థాయి సిబ్బందిలో  ఐదుగురిని అవార్డులకు ఎంపికచేసి, సత్కరించింది రోటరీ క్లబ్.  హైదరాబాద్ టూరిజం ప్లాజా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అటవీ సంపద రక్షణ, ఆక్రమణలకు గురైన అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవటం, అటవీ ప్రాంతాల అభివృద్దికి విశేషంగా కృషి చేసిన నలుగురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఒక ఫారెస్ట్ సెక్షన్ అధికారికి అవార్డులు దక్కాయి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడ రేంజ్ లో బీట్ అధికారిగా ఉన్న ఎక్కా శారద, అశ్వారావుపేట రేంజ్ వినాయకపురం సెక్షన్ అధికారి జీ.రమేష్, యాదాద్రి జిల్లా రాయగిరి బీట్ అధికారి శ్రీనివాస్, ఖమ్మం రేంజ్ పంగిడి బీట్ అధికారి పీ.డేనియల్, ఖమ్మం రేంజ్ వెలుగుమట్ల సెక్షన్ అధికారి ఎం. వేణుమాధవ్ లు రోటరీ క్లబ్ విధినిర్వహణలో నిబద్ధతతో పనిచేసినందుకు ఇచ్చే అవార్డులకు ఎంపికయ్యారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కిరణ్ పటేల్, సెక్రటరీ మొహినుద్దీన్, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కే.ఝా అవార్డులు అందించి సిబ్బందిని సన్మానించారు. అటవీ శాఖ తరుపున చేపట్టిన కార్యక్రమాలపై పీసీసీఎఫ్ పీ.కే.ఝా కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రయత్నాలకు పౌరసమాజం కృషి కూడా తోడైతేనే తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు. రోటరీ క్లబ్ తరుపున త్వరలోనే అర్బన్ పార్కులను సందర్శిస్తామని, తమ తరపున చేపట్టే కార్యక్రమాలను కూడా వెల్లడిస్తామని అధ్యక్షుడు కిరణ్ పటేల్ తెలిపారు. ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో పనిచేసే తమను గుర్తించి, హైదరాబాద్ కు పిలిపించి మరీ అవార్డులు ఇవ్వటంపై అవార్డు గ్రహీతలు ఐదుగురూ సంతోషాన్ని వెల్లడించారు. తమ శాఖ పనితీరుకు దక్కిన గుర్తింపుగా భావిస్తామన్నారు.

Related Posts