
కలంపై జులుం సహించేది లేదని, జగిత్యాల జిల్లాలో ఈవీఎంల తరలింపు విషయంలో లో వార్తలు రాసినందుకు విలేకరులపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం అమానుషమని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఐజేయు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ లు అన్నారు. గురువారం టీయూడబ్ల్యూజే( ఐజేయు) ఆధ్వర్యంలో లో జర్నలిస్ట్ లు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ లో లో మీడియా విశేష కృషి చేస్తుందన్నారు. అలాంటి మీడియా పై అనుచిత చర్యకు దిగడం సరికాదని హితవు పలికారు. అసత్యపు వార్తలు రాస్తారా అని అనిపిస్తే వివరణ ఇవ్వవచ్చు ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన వేయించుకునే అవకాశం కూడా ఉందన్నారు. కానీ ఇలా కేసులు నమోదుచేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారన్నారు. రోజురోజుకు జర్నలిస్టుల పై ఆంక్షలు విధిస్తూ ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. వార్తలు రాస్తే అసలు నమోదు చేయడం చాలా దారుణం అన్నారు. ఇప్పటికైనా తొమ్మిది మంది జర్నలిస్టుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వి తిరుమలా చారి, పాత్రికేయులు రమేష్, సురేష్ చారి, మీలిన్ కుమార్, రామదాస్ జాడే , వారణాసి శ్రీనివాస్, సుపియాన్, తదితరులు పాల్గొన్నారు..