YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈవీఎంల దగ్గర గులాబీ క్యాడర్

ఈవీఎంల దగ్గర గులాబీ క్యాడర్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. అయితే ఎన్నికల తేదీ నాటి నుంచి ఫలితాలు వెలువడానికి నెలన్నర రోజుల సమయం ఉంది. ఎన్నికలకు, ఫలితాలకు ఇంత పెద్ద గ్యాప్ రావడం ప్రధాన పార్టీల అభ్యర్థులను కలవరపెడుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ ను కాపలా పెట్టేందుకు సిద్ధమయ్యారు. విచిత్రమేంటంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈవీఎంలకు కాపలాగా ఉండటమనేది విస్మయం కలిగిస్తోంది. సాధారణంగా ప్రత్యర్థి పార్టీశ్రేణులు స్ట్రాంగ్ రూముల దగ్గర కాపలా కాసేందుకు ఈసీ అనుమతి తీసుకుంటారు.  ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ కు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి బరిలో నిలిచారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఫలితాలు రావడానికి చాలా సమయం ఉండటంతో ఈవీఎంల భద్రతకు టీఆర్ఎస్ శ్రేణులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర కాపలాకు సిద్ధమయ్యారు. పూటకు ఇద్దరు.. మొత్తం ఆరుగురు ఈవీఎంల కాపలా కోసం ఆరుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు ముందుకొచ్చారట. రోజుకు 3 షిఫ్టుల చొప్పున ఆరుగురు కార్యకర్తలు పోలీసుల బందోబస్తుకు తోడుగా ఉంటారట. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇద్దరు.. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు మరో ఇద్దరు.. అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఇంకో ఇద్దరు డ్యూటీలాగా చేస్తారట. ప్రత్యర్థులపై అనుమానమా? ప్రధానంగా ఖమ్మం సెగ్మెంట్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండనుంది. అయితే ఈవీఎంలకు పోలీసులేనా కాపలా?.. మేము సైతం అంటున్న గులాబీ క్యాడర్ తీరు చూసి కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఎన్నికల సంఘం అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా? లేదంటే వారికి వారే కాపలా డ్యూటీలు వేసుకున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తానికి ఈవీఎంల భద్రతకు గులాబీ క్యాడర్ సిద్ధం కావడంతో ప్రత్యర్థులు ఏమైనా చేస్తారని వారు భావిస్తున్నారా?.. లేదంటే పోలీసులపై నమ్మకం లేదా? అనే వాదనలు జోరందుకున్నాయి.

Related Posts