
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జిల్లాలోని నాగర్ కర్నూలు, అచ్చంపేట్, కల్వకుర్తి, కొల్లాపూర్ పట్టణాల్లో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి గాను, 5వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు, నాగర్ కర్నూల్ జిల్లాలో 4 పరీక్ష కేంద్రాల్లో 970 మంది విద్యార్థులు 5 వ తరగతి తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షకు హాజరు అవుతున్నారు. 1.నాగర్ కర్నూల్ పట్టణంలో తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించే పరీక్షకు 320 మంది బాలురు , అచంపేట్ పట్టణంలో తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించే పరీక్షకు 200 మంది బాలురు, కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించే పరీక్షలకు 220 మంది బాలికలు, కొల్లాపూర్ పట్టణంలో తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించే పరీక్షకు 230 మంది బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు, ఆయా పరీక్ష కేంద్రాల యందు అన్ని ఏర్పాట్లు ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేశారని, 5వ తరగతి తెలంగాణ మైనారిటీ గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల వెంట ఆయా పరీక్ష కేంద్రాల వరకు తల్లిదండ్రులు ఎవరో ఒకరు హాజరై తమ పిల్లల యందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకొని, విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత తమ తమ గమ్యస్థానాలకు చేరేందుకు తల్లిదండ్రులు తీసుకోవలసిన అన్ని జాగ్రత్త వహించాలి, పరీక్ష కేంద్రాలకు పరీక్షలు రాసే విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని, నాగర్ కర్నూల్ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.