YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ లో ఒక ఏక వ్యక్తి, నియంత పరిపాలనా సాగుతోంది పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి

తెలంగాణ లో ఒక ఏక వ్యక్తి, నియంత పరిపాలనా సాగుతోంది              పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలంగాణ లో ఒక ఏక వ్యక్తి, నియంత పరిపాలనా సాగుతోందని పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్చించారు.శుక్రవారం గాంధీ భవన్ లో పార్టీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగతో కలిసి మాట్లాడారు.అందుకు నిదర్శనం స్థానిక సంస్థ ల ఎన్నికల పోటి చేసే అభ్యర్థుల ఎంపిక తానే చూస్తానని,మంత్రి, ఎమ్మెల్యే కి ఎంపిటిసి, జెడ్పీటీసీ అభ్యర్థులకి హామీ ఇవ్వొద్దని ఆదేశించండమే నన్నారు. ఇటు కలెక్టర్ ల అధికారాలు మంత్రికి ఇవ్వడం, వల్ల ప్రజలకు నష్టం వాటిల్లితుందన్నారు.ఇలాంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యవస్తను నిర్వీరం చేయడమే అవుతుందని అన్నారు.కెసిఆర్ వ్యవహార శైలి చూస్తుంటే నియంత పాలనను గుర్తు చేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అబ్యార్తుల ఎన్నిక ను తప్పుబట్టిన కెసిఆర్ ఆయనచేస్తున్న పనేమితని ప్రశ్నించారు. తమది జాతీయ పార్టీ అయినందున ఏ నిర్ణయము తీసుకున్న పార్టీ అడిస్తాననిదేనని ఇది పార్టీ పుట్టిన నుండి వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు జగరుకతతో వ్యవహరించాలని మల్లు విజ్ఞప్తి చేసారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా కాకుండా పలక పక్షంగా వ్యవహరించేవిదంగా  కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలు కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారుఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అబ్యర్తులను గెలిపించుకొని ప్రజాస్వామ్యం ను బతికించుకోవాలన్నారు.మోరల్ రెస్పానైబులిటీ కోసమే అఫిడవిట్ అడుగుతున్నాం తప్ప మరొకటి కాదన్నారు.

Related Posts