YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీగా పెరగనున్న ‘కాళేశ్వరం’ వ్యయం?

భారీగా పెరగనున్న ‘కాళేశ్వరం’ వ్యయం?
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరుగుతోంది. దాదాపుగా మరో 20 వేల కోట్లు పెరుగుతోందని తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి అయ్యే ఖర్చు లక్ష కోట్లు దాటుతోందని ఇరిగేషన్ శాఖ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం. గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనికి 80వేల ఒక వంద కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.ఇప్పటి వరకూ నీటి లభ్యత ఉన్న సమయంలో రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. దీనికి అనుగుణంగా వర్షా కాలంలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 160 టీఎంసీల నీటిని ఎత్తి పోస్తారు. ఎత్తిపోసిన నీటిలో 140 టీఎంసీలు నిల్వ చేసేందుకు చిన్నవి, పెద్దవి కలిపి 20 రిజర్వాయర్లు నియమిస్తున్నారు. మిగిలిన 13 టీఎంసీలతో చెరువులు నింపాలని ప్లాన్ చేశారు.

Related Posts