
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రభుత్వం లో అనుకూల పలితాలు వస్తే తన ఖాతాలోకి,వ్యతిరేక పలితాలు వస్తే ఉద్యోగులమీదికి నెట్టడం సరికాదని టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ రెవిన్యూ శాఖలో ఎన్ఐసి స్థానం లో కేటీఆర్ సన్నిహిత వ్యక్తి కి చెందిన ధరణి వెబ్సైట్ ప్రవేశపెటారు.ఇప్పుడు ఆది సరిగా పని చేయకపోవడంతో..దాని పేరుతో రెవెన్యూ శాఖ మార్చేసే పై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.ఇంతవరకు విద్యాశాఖ లో ఒక్క పోస్టు ని నింపలేదని పనిచేస్తున్న ఉద్యోగులకు గడచిన 5 సంవత్సరాల్లో పిఅర్సి,కనీసం ఐఆర్ కుడా ఇవ్వలేని ఇంత దరిద్రం పరిస్థితి లో ప్రభుత్వం ఉందని విమర్శ్హించారు.ఇలాంటి తరుణం లో ఉద్యోగ సంఘాలు వారి హక్కుల కోసం పోరాటం చేయకుండా అనిచివేయలన్న కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.ఓట్ల కోసమే బావా బావమరిది లు పోటీ తప్ప..విద్యలో మార్పు కోసం పనిచేయడం లేదని అందుకు నిదర్శనం ముఖ్య మంత్రి ప్రాతి నిద్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో ఇంటర్లో 29 శాతం ఉత్తీర్ణతే అన్నారు. ఇది ఎంతో సిగ్గు చేటన్నారు.వారికి ఓట్లు, సీట్లు తప్ప విద్యార్థులు భవిషత్ అక్కర లేదన్నారు.ఉద్యోగుల కోసం ఐఆర్, పిఆర్సి, డిఏ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.నాడు తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్ చెసి రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యోగులను నేడు అవసరం తీరక వీరిని తొక్కి పట్టేస్తారా అని ప్రశ్నించారు.భార్య భర్త లైన ఉద్యోగులని కలిపేందుకు 180 జీవో ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు.ఆవనీతి పై చర్యలు తీసుకొనే అధికారం ప్రభుత్వం కి ఉందని,అనేక శాఖల్లో. మానిటరింగ్ లేక పోవడంతో ఇది జరుగుతుందన్నారు.రెవెన్యు శాఖలో అవినీతి కుంతున్నప్పుడు పొలిసు స్ఘఖలో కూడా అవినీతి జరుగుతుందని ఆ శాఖను మార్చే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు.