
హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం జరిగిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. గౌలీగూడలోని రామమందిరం నుంచి ప్రారంభమైన ఈ విజయ యాత్ర తాడ్బండ్ హనుమాన్ గుడి వరకు కొనసాగింది. వేలాదిమంది హనుమాన్ భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. 15 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తు యువకులు కాషాయ దుస్తులతో వివిధ నృత్యాలు చేస్తూ అలరించారు. యాత్ర పోడుగునా దారి పక్కన తాగునీరు, మజ్జిగ పానీయాలు ఏర్పాటు చేసారు. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 20 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం, గుడ్ ఫ్రైడే లు కుడా కలిసిరావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ బాటా, బైబిల్ హౌస్ మీదుగా తాడ్ బండ్ వరకు శోభాయాత్ర సాగంది. ఇప్పటికే ఈ మార్గాన్ని సీపీ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు.