YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మైలార్ దేవ్ పల్లిలో ఎన్ఐయే సోదాలు

 మైలార్ దేవ్ పల్లిలో ఎన్ఐయే సోదాలు
హైదరాబాద్ లో ఈరోజు ఉగ్ర కలకలం చెలరేగింది. నగరంలోని మైలార్ దేవ్ పల్లి ప్రాంతంలో ఉన్న శాస్త్రిపురం కింగ్స్ కాలనీలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు శనివారం తెల్లవారుజామునుంచి సోదాలు నిర్వహించారు. అబుదాబీ ఐసిస్ మాడ్యుల్ కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరులు ఇక్కడ నక్కి ఉన్నారన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు పలువురి ఇళ్లలో శనివారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 
2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబిలో ఐసిస్ మాడ్యూల్ కేసులో అతడిపై ఛార్జిషీటు నమోదైంది. మరికొందరికి ఐసిస్తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల సహకారంతో ఏడెనిమిది ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం ముగ్గురు ఐఎస్ఐఎస్  ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐయే తన చార్జీ షీట్ లో పలు ఆరోపణలు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడికి ప్లాన్ చేసారని పేర్కోంది. ఉగ్రదాడి చేసేందుకు కెమికల్స్, డబ్బులను కూడా సమకూర్చుకున్న వైనాన్ని బయటపెట్టింది.  ఢిల్లీలో ఆర్ ఎస్ఎస్ నేత  హత్యకు సీమాంతరం నుంచి ఆదేశాలు రావడంతో బాసిత్ ఢిల్లీకి వెళ్లాడు. బాసిత్ కు 4 గురు యువకులు,  ఒక ఏకే 47 తుపాకిని ఐఎస్ఐఎస్ సమకూర్చినట్లు ఎన్ఐయే పేర్కోంది.  అదృష్గవశాత్తూ ఉగ్రదాడి గురించి ముందస్తు సమాచారం అందకున్న అధికారులు అందిరని అదుపులోకి తీసుకున్నారు. కాగా, శనివారం జరిపిన  తనిఖీల్లో ఏం బయటపడింది అన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాలేదు.

Related Posts