
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంటర్మిడియట్ బోర్డ్ తమపిల్లల జీవితాలతో చెలగాటం అడుతుందని నాంపల్లి లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు తల్లిదండ్రలు శనివారం ఉదయం ధర్నా నిర్వహించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్లక్ష్యం వలన తమ పిల్లల జీవితాలు నాశనం అవుతుందని వారు మండిపడుతున్నారు. మెరిట్ విద్యార్థులకు కూడా మార్కులు తక్కువ రావడం తమకు నిద్రలేకుండా చేసిందని వారు వాపోయారు. పేపర్లు దిద్దకుండా ఇష్టానుసారంగా మార్కులు వేశారంటూ ఆరోపించారు. అర్హత లేనివాళ్లతో పేపర్లు దిద్దించారని అనుమానం వ్యక్తం చేశారు.తక్షణమే తారుమారు అయిన మార్కులను సరి చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు